అలజడులే తెప్పించావే నవ్వుతో నా ప్రాణంలో
కలలన్నీ మార్చేసావే నా ఊహల్లో
ఓ ఓ
నా మాటే నాకే వినపడదే
ఓ ఓ
నాలో ప్రేమే నీకు ఎలా చెప్పనే
మార్చుకున్న మాటనే చూపుగా
నీతో చనువునే ప్రేమగా
తార తీరాలైనా నీ కోసం నే దాటైనా
నీతో మౌనంగానే సంతోషాన్నే వెతికైనా
కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె
సంగతేంటో చూడే మైనా
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటే వస్తా ఏదేమవని
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటే వస్తా ఏదేమవని
సంతోషం ఏదో మొదలయ్యిందే నీ వలన
నాలో నన్నే నేను కొత్తగా వింతగా చూసుకుంటున్నా
ఏ క్షణమైనా నువ్వు కనిపించకుంటే ఓ తపన
లోకాన్నే నేనే భూతద్దంతో వెతికేస్తున్నా
నీ మాటలలో చేరిపోయే నా ప్రాణం
నా గుండెల్లో చుట్టుకుంది గారం
నీ కళ్లల్లో ఆగిపోయే నా లోకం
నా ప్రేమంతా నిండిపోయే మౌనం
కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె సంగతేంటో చూడే మైనా
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటే వస్తా ఏదేమవని
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటే వస్తా ఏదేమవని
చిన్ని చిన్ని నా నా నా నా నా నా నా నా హో చిన్ని చిన్ని